దామరచర్ల, జూలై 11: రాష్ట్రంలో ఏర్పడే విద్యుత్ డి మాండ్‌ను దృష్టిలో ఉంచుకొని యాదాద్రి పవర్‌ప్లాంటు ఐదో యూనిట్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్‌మిట్టల్ అన్నారు. నల్లగొండ జిల్లా యాదాద్రి పవర్‌ప్లాంటును జెన్కో సీఎండీ హరీశ్‌తో కలసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ప్లాంటులోని కోల్ మార్షలింగ్ యార్డు, కూలింగ్ టవర్లు, స్విచ్‌యార్డు తదితర యూనిట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్లాంటులో మొక్కలు నాటా రు. అనంతరం ప్లాంటు ఇంజినీర్లు, జెన్కో, బీహెచ్ఈఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్లాంటు పూర్తిస్థాయి వివరాలను, యూనిట్ల పనితీరును అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ..జనవరి నుంచి రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఐదోయూనిట్ను గడువుకు ముందే పూర్తిచేసి విద్యుత్తును అందించాలన్నారు.
ప్లాంటులో పర్యావరణ, టౌన్షిప్, సివిల్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యత ఉండేలా చూడాలన్నారు. బొగ్గు తక్కువ ధరకు తీసుకొనేలా మార్గాలను అన్వేషించాలన్నారు. అనంతరం సీఎండీ హరీశ్ మాట్లాడుతూ.. వైటీపీఎస్‌కు వచ్చే రహదార్లను అభివృద్ధి చేయాలన్నారు. ఆర్ఎండ్బీ ద్వారా నిర్మిస్తున్న రహదారి భూసేకరణ త్వరగా పూర్తిచేయాలన్నారు.
ప్రాజెక్టు ఆవరణలో స్క్రాప్‌ను తొలగించాలన్నారు. కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ పవర్ డైరెక్టర్ తీజేందర్గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపా ఠి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, వైటీపీఎస్ సివిల్ డైరెక్టర్ అజయ్, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మయ్య, సివిల్ సీఈ శ్రీనివాసరావు, బీహెచ్ఈఎల్ సీఈ సురేశ్, వినోద్, జాకబ్ ఉన్నారు.