కోదాడ, అక్టోబర్ 15 : దేశాభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలకమని ప్రముఖ పర్యావరణవేత్త సురేష్ గుప్తా అన్నారు. బుధవారం కోదాడ కేఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పర్యావరణహిత స్వదేశీ ఉత్పత్తుల ద్వారా దేశ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ చందా అప్పారావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దేశభక్తి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్ర బృందం పర్యావరణ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.