MP Tejasvi Surya | హిల్ కాలనీలోని నాగార్జునసాగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బిజెపి ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భారత్, పాకిస్థాన్ విభజనతో పోల్చడాన్ని నల్గొండ జిల్లా నందికొండ బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ హిల్ కాలనీలోని నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై తేజస్వి దిష్టబొమ్మను దహనం చేశారు
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉనికిని, అమరవీరుల త్యాగాలను అవమానించారని మండిపడ్డారు. బలిదానాలతో సిద్దించిన తెలంగాణ రాష్ట్రాన్ని అగౌరవపరిచేలా మాట్లాడటం తేజస్వి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తేజస్వి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కౌన్సిలర్ హీరేకర్ రమేష్ జి, నందికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ముఖ్య సలహాదారుడు ఆదాసు విక్రం,1వ వార్డు ఇంచార్జ్ పమ్మి జనార్దన్ రెడ్డి, 2 వ వార్డు ఇంచార్జ్ మహమ్మద్ గని, 4వ వార్డు ఇంచార్జ్ విజయ్,6 వా వార్డ్ ఇంచార్జ్ చంద్రమౌళి నాయక్, 10 వ వార్డ్ ఇంచార్జ్ కోడా విజయ్, అర్జున్ నాయక్, లక్ష్మణ్ నాయక్, శేఖరా చారి, మన్సూర్, రవి, నజీర్, భూయాకర్ శివ, పిట్ట సైదులు , దార రవి, తదితరులు పాల్గొన్నారు.