నల్లగొండ, ఫిబ్రవరి 26 : ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి జీవితంలో ఎన్నో మలుపులు తిప్పుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక్కడ విద్యార్థి నిర్ణయం, ప్రవర్తన జీవితం నిలబడాలా లేదా పడేయాలా అనేది తెలుపుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యావకాశాలపై నమస్తే తెలంగాణ-కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రగతి బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం విద్యార్థినులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తర్వాత సరైన నిర్ణయం తీసుకోకుంటే జీవితంలో ఫెయిల్యూర్ అవుతుందని, ఇంటర్మీడియట్, మీడియమ్ ప్రోగ్రామింగ్ ఎర్రర్స్‌ను కరెక్ట్ చేసే హైలెవల్ ప్రోగ్రామింగ్ లక్ష్యంగా పెట్టుకొని ప్రతి విద్యార్థి తమ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటే జీవితం సాఫీగా ముందుకు వెళ్తుందని తెలిపారు. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ విద్యా విధానం, ఏయే కోర్సుల్లో ఎలాంటి సెటిల్మెంట్ ఉంటుంది అనే కోణంలో వివరించడంతోపాటు విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొనగా వారిలో ఇద్దరికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేశారు. మరో విద్యార్థినికి తన సామర్థ్యాన్ని గుర్తించి ప్రతిభా పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్యూరో ఇన్చార్జి మర్రి మహేందర్ రెడ్డి, ఏడీవీటీ మేనేజర్ శివ కుమార్, స్టాఫ్ ఫొటో గ్రాఫర్ ఆకాశ్, హెచ్ఆర్ కిరణ్, అన్వర్ తదతరులు పాల్గొన్నారు.
పరుగెడుతున్న పోటీ ప్రపంచానికి దీటైన వేదికగా.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పరిపూర్ణ మార్గదర్శిగా, యువతకు ఒకే సమయంలో బహుళ డిగ్రీలను అందించే ఏకైక విద్యా సంస్థ కేఎల్ యూనివర్సిటీ. ఇంటర్మీడియట్ తర్వాత జేఈఈ మెయిన్స్‌కు సంబంధించి రెండు సెషన్లుగా పరీక్షలు ఉంటాయి. వాటిల్లో 97పర్సంటైల్ దాటిన విద్యార్థులకు మా యూనివర్సిటీలో ఉచిత విద్యా అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఐఐటీల్లో 58వేల సీట్లు ఉన్నాయి. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌లో 99.9పర్సంటైల్ సాధించిన వారికి త్రిపుల్ ఐటీ హైదరాబాద్, చెన్నై లాంటి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి. ఇంజినీరింగ్‌లో ఏఐతో పాటు ఈసీఈ, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సులు ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో సీటు రాకుంటే బీ ఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీకి కూడా మంచి భవిష్యత్ ఉంది. దేశంలో 1,208 కళాశాలలు ఉంటే వాటిల్లో 452 కళాశాలలకు మాత్రమే న్యాక్ గుర్తింపు ఉంది.
– కిశోర్ బాబు, డీన్, కేఎల్ యూనివర్సిటీ
ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ విద్యలో అందరు టెక్నికల్ కోర్సులపైనే దృష్టి సారిస్దారు. అయితే టెక్నికల్ కోర్సులతో పాటు నాన్ టెక్నికల్ కోర్సులు ఏంటి..వాటి వల్ల ఉపయోగమేంటి అనే కోణంలో వివరిస్తూ అవగాహన పర్చటం బాగుంది. నాన్ టెక్నికల్ కోర్సులపై నాకు ఇప్పటి వరకు పెద్దగా అవగాహన లేదు. ఈ రోజుతో పూర్తిగా వాటిపైనా అవగాహన వచ్చింది. అయితే ఇంటర్ తర్వాత ప్రతి విద్యార్దికి ఉన్నత చదువులపై అవగాహన అవసరం ఉండాల్సి ఉంది.
– పోరెడ్డి మహిత, ఎంపీసీ విద్యార్థిని
బైపీసీ చేస్తున్నామంటే ఎంబీబీఎస్ చేయాలనే తపన ప్రతి విద్యార్థికి ఉం టుంది. ఎంబీబీఎస్ సీటు కొట్టడం ఎంత కష్టమో, దానికి ఖర్చు పెట్టడం కూ డా అంతే కష్టం. ఎంబీబీఎస్ రాకున్నా ఫార్మసీ రంగంతో పాటు అగ్రికల్చర్ బీఎస్సీ ద్వారా విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది నాకు ఇప్పటి దాకా అవగాహన లేదు. ఎల్ఎల్బీ, ఐఏఎస్ లాంటి వాళ్లు సైతం అగ్రికల్చర్ రంగం నుంచి వచ్చారంటే సంతోషంగా ఉంది. ఈ ప్రోగాం నాకు చాలా ఉపయోగపడింది.
– సిరి, బైపీసీ విద్యార్థిని
విద్యా విధానంలో ఇంటర్మీడియట్ వరకు ఒక భాగమైతే ఆ తర్వాత మరో భాగంగా చూడాలి. ఇంటర్ తర్వాత విద్యా విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇంజినీరింగ్‌తోపాటు వైద్య విద్యలో కోర్సులు భిన్నంగా ఉంటాయి. ఆయా విభాగాల్లో అనేక కోర్సులు ఉన్నందున వాటి ప్రాధాన్యత ఏంటి, విద్యార్థుల ప్రతిభ ఏంటి అనే కోణంలో కోర్సు ఎంచుకొని ముందుకు సాగాలి. భవిష్యత్‌లో మంచి పొజీషన్లో ఉండాలంటే ఇంటర్ తర్వాత తీసుకునే స్టెప్ బాగుండాలి.
– తవిటి మహేందర్, బ్రాంచ్ మేనేజర్, నమస్తే తెలంగాణ
ఇంటర్మీడియట్ తర్వాత కెరీర్ గైడెన్స్ అనేది చాలా ప్రాముఖ్యం. కొందరి ఇండ్లల్లో చదువుకోని వారు ఉండి వారి పిల్లలను చదివిద్దామంటే చెప్పేవాళ్లు ఉండరు. అలాంటి వారికి కెరీర్‌పై అవగాహన ఉండదు. ఈ కెరీర్ గైడెన్స్ విషయంలో ప్రభుత్వాలే బాధ్యత తీసుకొని అవగాహన కల్పిస్తే బాగుంటుంది. కేఎల్ యూనివర్సిటీతోపాటు నమస్తే తెలంగాణ దిన పత్రిక వాళ్లు ముందుకు వచ్చి ఈ సదస్సు పెట్టి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు.
– ఎస్ సుష్మ, బైపీసీ విద్యార్థిని
ఏదైనా ఒక వస్తువు తయారీలో ఒక్కరే కాకుండా పలువురు ఇంజినీర్ల పాత్ర ఉంటుంది. ఆ వస్తువు తయారు చేసే క్రమంలో వినియోగించే ప్రతి దానిపై అవగాహన కలిగి ఉండటమే మల్టీ డిసిప్లేనరీ ఇంజినీరింగ్. ఇది ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి. కింది స్థాయిలో ఉన్న ఇంజినీర్లు చేసే తప్పులు సరిచేసే ప్రోగ్రామర్స్‌కు కోట్ల రూపాయల్లో ప్యాకేజీలు ఉంటున్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత ప్రతి విద్యార్థి ఇంజినీరింగ్ విద్యతోపాటు ఎంబీబీఎస్‌లో నైపుణ్య స్కిల్స్ నేర్చుకుంటేనే మనుగడ ఉంటుంది. నేడు ఏఐ టెక్నాలజీ మనిషి జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. ఏఐ మనిషి చేసే విధంగా ఏనాడూ చేయలేదు. దాన్ని మించిన సామర్థ్యాన్ని కలిగి ఉంటేనే మనకు సమాజంలో గొప్ప గుర్తింపు ఉంటుంది. భాష, సిలబస్ అనేవి ఎన్ని ఉన్నా నేను చేయగలను అనే నమ్మకం ఉండాలి. నిర్ఫ్ ఇచ్చే ర్యాంకింగ్ బట్టి విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకోవాలి.
– డాక్టర్ షన్ముఖ కుమార్, కేఎల్ యూనివర్సిటీ
ఇంజినీరింగ్ విద్యార్థులు కాలానుగుణంగా డిమాండ్ ఏర్పడ్డ సీఎస్‌పైనే దృష్టి సారించి ఏఐఎమ్ఎల్ కోర్సును కోరుకుంటున్నారు. ఏఐ మనిషి జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటీ, నిట్, త్రిపుల్ ఐటీ లేదా ఎంసెట్‌లో మంచి ర్యాంకు కొట్టిన తర్వాత యూనివర్సిటీ, కళాశాల ఎంపికతో పాటు ఆ కళాశాలలో ఫ్యాకల్టీ సామర్థ్యాన్ని బట్టి జాయిన్ అయితే మంచి భవిష్యత్ ఉంటుంది. వీటిపై ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్లోనే అవగాహన కలిగి ఉండాలి.
– శశిధర్ రావు, ప్రగతి కళాశాల డైరెక్టర్
ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు సాధారణ విద్య ఉండగా ఇంటర్మీడియట్ తర్వాత మొత్తం ప్రవేశ పరీక్షలపైనే విద్యా విధానం ఆధారపడుతుంది. ఈ ప్రవేశ పరీక్షలతోపాటు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలపైనా దృష్టి సారించాలి. ప్రవేశ పరీక్షల అనంతరం మంచి కళాశాలను ఎంపిక చేసుకోని జాయిన్ అయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు. కాలానుగణంగా కొత్త కోర్సులు టెక్నాలజీకి అనుగుణంగా విద్యలో భాగమైతున్నందున వాటిని అవపోసన పట్టి తమ సామర్థ్యాన్ని పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
– చందా శ్రీనివాస్, ప్రగతి కళాశాల డైరెక్టర్
సాధారణంగా ప్రాథమిక విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి అవగాహన ఉంటుంది. ఇంటర్మీడియట్ తర్వాత సబ్జెక్టుల వారీగా కోర్సుల ప్రవేశం ఉంటున్నందున ప్రతి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో కెరీర్ గైడెన్స్‌పై అవగాహన నిర్వహించడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంతో నేను ఎంపీసీ తర్వాత నా ఆసక్తిని బట్టి ఏ కోర్సు చేయాలనే అవగాహన వచ్చింది.
– ఎస్.అక్షయ, ఎంపీసీ విద్యార్థిని