మిర్యాలగూడ, సెప్టెంబర్ 30: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ రెడ్డికాలనీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వేములపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భాస్కర్‌రావు మా ట్లాడుతూ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నియమించినా అందరూ సమిష్టిగా కృషి చేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి గ్రూ పులు, వర్గాలు లేకుండా పనిచేసి అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేశారని, ఆ కార్డును గ్రామాల్లోని ప్రజలందరికీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, చిర్ర మల్లయ్య యాదవ్, కట్టా మల్లేశ్‌గౌడ్, మజ్జిగపు సుధాకర్‌రెడ్డి, పేరాల కృపాకర్‌రావు, నంద్యాల శ్రీరాంరెడ్డి, అమిరెడ్డి శేఖర్‌రెడ్డి, మేక రవి, పేరాల గురువారావు, దేవరాజ్, రేగూరి రాము, గురువయ్య తదితరులు పాల్గొన్నారు.