నల్లగొండ, ఆగస్టు 19 : ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలోని ఐ.బి స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ బేస్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో టి.జి.ఎం.ఆర్.ఎస్ & జె.సి నల్లగొండ గర్ల్స్-1 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని పి.కీర్తన మెరిట్ మూడవ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కుతేజుల్ కుబ్ర, అధ్యాపకులు, సహ విద్యార్థినులు అభినందనలు తెలిపారు.