నల్లగొండ సిటీ, మే 20 : తెలంగాణ మజ్దూర్ యూనియన్ అశ్వద్ధామరెడ్డి నాయకత్వంలో బుధవారం నల్లగొండలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నల్లగొండ డిపో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జోనల్ నాయకుడు మీలా ప్రభాకర్ రావు, నల్లగొండ ఉమ్మడి జిల్లా కార్యదర్శి గోపబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తయ్యబుద్దిన్ మాట్లాడుతూ.. ఆర్టీసీలో ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న విలీన ప్రక్రియ జూన్ 2న ప్రకటించాలని కోరడం జరిగిందన్నారు. జోనల్ నాయకుడు మీలా ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. సమ్మెలో భాగంగా 32 డిమాండ్లలో మిగిలిన 29 డిమాండ్లను వెంటనే చర్చించి పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పించాలని తెలియజేశారు. నల్లగొండ డిపో నూతన కమిటీ అధ్యక్షుడిగా బి.రామలింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సీహెచ్ శంకరయ్య, డిపో కార్యదర్శిగా ఈ.సత్తిరెడ్డి, అదనపు కార్యదర్శిగా శివకుమార్, కోశాధికారిగా ఎస్.వెంకన్న, డిపో కార్యవర్గ సభ్యులుగా ఎల్లయ్య, ఈ కే మోహన్, శారద, జయప్రద, పద్మ, రాణి ఎన్నికయ్యారు.