నల్లగొండ రూరల్, జూలై 26 : జాతీయ సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీలకు నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కుంచం రాకేశ్, గోగుల అఖిల్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని నల్లగొండ హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి కూతురు శ్రీనివాస్ రెడ్డి, ఇమామ్ కరీం శనివారం తెలిపారు. ఈ నెల 28 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు చెన్నెలో జరిగే పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు వెల్లడించారు. కుంచం రాకేశ్ తెలంగాణ హాకీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వీరి ఎంపిక పట్ల హాకీ కోచ్ యావర్, సీనియర్ క్రీడాకారులు ఫరూక్, అజీజ్, మురళి, శేఖర్, కార్తీక్, హేమాద్రి హర్షం వ్యక్తం చేశారు.