నీలగిరి: పార్టీ నూతన సారధులుగా బాధ్యతలు స్వీకరించిన వారు చిత్తశుద్ధితో పని చేసి సీఎం కేసీఆర్ సారథ్యంలో చేపడు తున్న అభివృద్ధి పథకాలను ప్రతి గడపలోకి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ సంస్దాగత నిర్మాణంలో భాగంగా పట్టణంలోని 12, 26, 27, 28, 29, 30, 31 వార్డులో పర్యటించి నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షులను ప్రకటించి వారికి శుభాకాంక్షలు తెలియ జేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పార్టీ పట్ల విధేయతతో ఉండి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఇతర పార్టీ నాయకుల విమర్శలను ధీటుగా తిప్పి కొట్టాలన్నారు.
అంతకుముందు 1, 2, 3, 18, 19, 39, 41 వార్డులకు సంబంధించి అనుబంధ సంఘాల సభ్యులను జిల్లా పరిషత్ కోఅప్షన్ సభ్యుడు జాన్శాస్త్రీ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. 12వ వార్డు అధ్యక్షుడిగా పబ్బతిరెడ్డి అంజిరెడ్డి, 26వ వార్డుకు ఎండీ నసీరుద్దీన్, 27వ వార్డుకు షకీలంభట్ల భజరంగప్రసాద్, 28వ వార్డుకు బద్దెల జగదీశ్ యాదవ్, 29వ వార్డుకు దుబ్బ అశోక్సుందర్, 39వ వార్డుకు మామిడి పద్మ, 31వ వార్డుకు కుకునూరి జలంధర్రెడ్డిలను ఎన్నుకున్నారు.
సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి , వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, పట్టణ పార్టీ అద్యక్షుడు పిల్లి రామ రాజు, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్, మహ్మద్ ఖయ్యూంబేగ్, బషీరుద్దీన్, ఎడ్ల శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, సంకు ధనలక్ష్మి, వనపర్తి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.