పోలీస్ సేవలను మరింత చేరువ చేస్తా
జిల్లా ప్రజలకు మరింత చేరువగా, విశ్వసనీయతను పెంచేలా పోలీస్ సేవలు అందించడమే లక్ష్యం.
- ఎనీ టైమ్ అవేలబులిటీనే లక్ష్యం
- ఎస్పీగా 24 గంటలు అందుబాటులో ఉంటా
- ప్రజలు నేరుగా నా ఆఫీసుకు రావచ్చు
- అత్యవసరమైతే 9440795600 నంబర్‌కు కాల్ చేయొచ్చు
- శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం
- సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు
- ప్రజాసేవ కోసమే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేశా
- నమస్తే తెలంగాణతో నల్లగొండ నూతన ఎస్పీ అపూర్వరావు
నల్లగొండ ప్రతినిధి, జనవరి 30(నమస్తే తెలంగాణ) : జిల్లా ప్రజలకు మరింత చేరువగా, విశ్వసనీయతను పెంచేలా పోలీస్ సేవలు అందించడమే లక్ష్యం. అందుకోసం ఎస్పీగా 24 గంటలు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటా. సమస్యలున్న ప్రజలు క్షేత్రస్థాయిలో సరైన స్పందన లేకుంటే నేరుగా నా కార్యాలయానికి రావచ్చు. అత్యవసర పరిస్థితుల్లో లేదా అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఇవ్వాలనుకుంటే నేరుగా నా నంబర్‌కు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నంబర్ 9440795600. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యమివ్వడంతో పాటు సంఘ విద్రోహశక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తా’నని నల్లగొండ జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అపూర్వరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలపై తన మనోగతాన్ని వెల్లడించారు. పబ్లిక్ సర్వీసుపై ఉన్న ఆసక్తి మేరకే సాఫ్ట్వేర్ ఫీల్డ్‌ను వదిలి సివిల్స్ సాధించినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజల సహకారంతో అత్యుత్తమ పోలీస్ సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. జిల్లా ఎస్పీగా తన లక్ష్యాలను వివరించారు.
జిల్లా ప్రజల సహకారంతో అత్యుత్తమ పోలీస్ సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తా అని ఇటీవలే నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అపూర్వరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నమస్తే తెలంగాణకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇస్తూ అనేక విషయాలపై తన మనోగతాన్ని వెల్లడించారు.
నమస్తే తెలంగాణ : మీ స్వస్థలం, కుటుంబ నేపథ్యం?
ఎస్పీ అపూర్వరావు : మాది హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని బేగంబజార్. మా నాన్న సివిల్ కాంట్రాక్టర్, అమ్మ గృహిణి. ఒక అక్క. విద్యాభాసం అంతా హైదరాబాద్‌లోనే. బీటెక్ ఘట్కేసర్ శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజ్. 2010లో బీటెక్ పూర్తి. వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్లో టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ జాబ్. చెన్నైలో మూడేండ్లు జాబ్ చేశా. జాబ్ చేస్తూనే సివిల్స్‌పై ఆసక్తితో సిద్ధమై ఐపీఎస్ సాధించాను.
నమస్తే తెలంగాణ : సాఫ్ట్‌వేర్‌ను వదిలేసి సివిల్స్ వైపు రావడంలో ఉద్దేశ్యం?
ఎస్పీ అపూర్వరావు : చిన్నప్పటి నుంచే పోలీస్ కావాలన్నది కోరిక. సినిమాల్లోని పోలీస్ పాత్రల ప్రభావం కూడా ఉంది. దీంతో ఆ కల కేరీర్తోపాటు అలాగే ఉంటూ వచ్చింది. బీటెక్ తర్వాత టీసీఎస్‌లో జాజ్. ఈ సమయంలోనే నా కొలిగ్స్ చర్చ. పబ్లిక్ సర్వీస్ అయితే ఇంకా బాగుంటుందని. అప్పుడే సివిల్స్ రాయాలని ఆలోచించా. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేరయ్యా. తొలి అటెంప్ట్‌లో హిందీ ఆప్షనల్‌గా ఫెయిల్ అయ్యా. మరింత పట్టుదలతో రెండో అటెంప్ట్‌లో తెలుగు ఆప్షనల్‌గా సక్సెస్ అయ్యా. 2014లో ఐపీఎస్‌కు సెలక్టయ్యా. ఇక వెనుదిరిగి చూడలేదు.
నమస్తే తెలంగాణ : ఐపీఎస్‌గా మీ ప్రస్థానం ఎలా మొదలైంది?
ఎస్పీ అపూర్వరావు : 2014 ఐపీఎస్ బ్యాచ్ నాది. అదృష్టంగా తెలంగాణ కేడర్‌కే కేటాయించారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రం నుంచి ఎంపికైన తొలి మహిళా ఐపీఎస్ నేనే అనుకుంటా! దీంతో ‘తెలంగాణ ఐపీఎస్’ అని నా కొలిగ్స్ అంటుంటారు. ఖమ్మంలో ఐపీఎస్‌గా శిక్షణ పూర్తి చేసుకున్నా. గోదావరిఖని ఏఎస్పీగా ఏడాదిన్నర కాలం పనిచేశా. తర్వాత సీఐడీ ఎస్పీగా హైదరాబాద్‌లో 6 నెలలు పనిచేశాక, 2018లో వనపర్తి ఎస్పీగా బాధ్యతలు చేపట్టాను. ఇక్కడ ఎస్పీగా చేస్తూనే ఏడాదిపాటు గద్వాల అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించా. నాలుగేళ్ల అనంతరం నల్లగొండకు ఎస్పీగా వచ్చా. రెమా రాజేశ్వరి గారి నుంచే అప్పుడు వనపర్తిలో, ఇప్పుడు నల్లగొండలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించా.
నమస్తే తెలంగాణ : నల్లగొండ జిల్లాతో గతంలో అనుబంధం?
ఎస్పీ అపూర్వరావు : హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను కాబట్టి నల్లగొండపై కూడా అవగాహన ఉంది. ఖమ్మంలో శిక్షణ కోసం వెళ్లే సమయంలో జిల్లా మీదుగానే వెళ్లేది. దీంతోపాటు ముఖ్యమైన ప్రాంతాల గురించి తెలుసు. జిల్లా ఎస్పీగా చేపట్టా. త్వరలోనే పూర్తి అవగాహన కోసం కృషి చేస్తా.
నమస్తే తెలంగాణ : జిల్లా ఎస్పీగా మీ ప్రాధాన్యత అంశాలు?
ఎస్పీ అపూర్వరావు : రాష్ట్రంలోనే పెద్ద జిల్లా నల్లగొండ. శాంతిభద్రతలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తా. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తాం. సంఘవిద్రోహ శక్తులు, రౌడీ మూకలు, ఈవ్ టీజర్లపై పటిష్టమైన నిఘా పెడతాం. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలకు అడ్డుకట్టవేసేలా పటిష్ట చర్యలు చేపడతాం. జిల్లా మీదుగా అనేక ప్రధాన రహదారులు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారిస్తాం. సమస్యల్లో ఉన్న ప్రజలకు చట్టబద్ధంగా భరోసానిచ్చేలా పోలీస్ సేవలకు కృషి చేస్తా. క్షేత్రస్థాయి నుంచి పోలీస్ శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తా.
నమస్తే తెలంగాణ : జిల్లా పోలీస్ బాస్‌గా ప్రజలకు ఏం చెబుతారు?
ఎస్పీ అపూర్వరావు : పోలీస్ సేవలు ‘ఎనీ టైం అవైలబులిటీ’గా ఉండేలా చర్యలు తీసుకుంటా. జిల్లా ఎస్పీగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండడమే నా లక్ష్యం. కింది స్థాయిలో సరైన స్పందన లేకుంటే బాధితులెవరైనా సరే జిల్లా పోలీస్ కార్యాలయానికి రావచ్చు. నన్ను నేరుగా కలవచ్చు. అత్యవసరమైతే నా నంబర్(9440795600)కు కాల్ చేయవచ్చు. ప్రతి కాల్ అటెంప్ట్ చేసేందుకు ప్రయత్నిస్తా. అసాంఘిక కార్యకలాపాలపై, సంఘ విద్రోహశక్తుల చర్యలపై ఫోన్లో నేరుగా సమాచారం ఇవ్వొచ్చు. ఫైనల్‌గా ప్రజల సహకారంతోనే అత్యుత్తమ పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తా.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

