అర్వపల్లి, సెప్టెంబర్ 29 : జాజిరెడ్డిగూడెంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కబడ్డీ క్రీడా పోటీలను డిసిసి ఉపాధ్యక్షుడు ధరూరి యోగానంద చార్యులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజేతలకు మొదటి బహుమతిగా రూ.30,016, ద్వితీయ బహుమతిగా రూ.20,016, తృతీయ బహుమతిగా రూ.15,016, చతుర్థ బహుమతిగా రూ.10,016 అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలు అక్టోబర్ 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో. బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్, నసీర్ గౌడ్, ఖజా యాదవ్, సందీప్, సోమయ్య, రాంప్రసాద్, విజయ్, అనిల్, మధు, ప్రవీణ్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.