నీలగిరి, జూన్ 23: యువత మత్తు పదార్థాలకు బానిసలై, భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దని, మాదక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఆదిత్య పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో మొకలు నాటి మాదక ద్రవ్యాలు వినియోగ వల్ల కలిగే అనారోగ్య ప్రభావాలు, ఆర్థిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలు లాం టి చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశ నం చేసుకోవద్దన్నారు. విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యంపై పడే హానికర ప్రభావాలతోపాటు ఆర్థిక నష్టాలు, సమాజంలో గుర్తిం పు గౌరవం ఉండదని సూచించారు. జిల్లాలో ఎకడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే సమాచారం అందించాలన్నారు.
అనంతరం జిల్లా పోలీ సు కార్యాలయంలో మిషన్ పరివర్తన్ మా దక ద్రవ్యాల సమాజ నిర్మూలనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన పోస్టర్‌ను ఆవిషరించి డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ప్రతిఒకరూ సైనికుల వలె పాటుపడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేశ్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్, హరిబాబు, ఎస్ఐలు సైదులు, సైదాబాబు, శంకర్, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
వృత్తి నైపుణ్యాలపై డ్యూటీ మీట్
కేసుల దర్యాప్తు, పోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, నేర పరిశోధన, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డాగ్ స్వాడ్, బాంబు డిస్పోజల్ టీం లాంటి అంశాలపై జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి వృత్తి నైపుణ్యాలపై జిల్లాస్థాయి డ్యూటీ మీట్ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించి మాట్లాడుతూ..పోలీసులు విధి నిర్వహణలో కేసుల దర్యాప్తు, నేర పరిశోధనలో వృత్తి నైపుణ్యాలు ఎంతగానో దోహదపడనున్నందున వాటిపై మరిన్ని మెళకువలు పెంపొందించుకోవాలన్నారు.
జిల్లాస్థాయిలో నిర్వహించే కేసుల దర్యాప్తు, పోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, నేర పరిశోధనలో ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీ, డాగ్ స్వాడ్, బాంబు డిస్పోజల్ టీం లాంటి అంశాల్లో పట్టు సాధించి జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయిలో ఎంపిక కావాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేశ్ ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఎస్ఐలు శ్రీను, సంతోష్ ఆర్ఎస్ఐ కల్యాణ్ రాజ్, సాయిరామ్, సిబ్బంది ఉన్నారు.
హరితహారం చెట్లు నరికివేత
దామరచర్ల, జూన్ 23: హరితహారం కింద నాటిన చెట్లను నరికివేస్తున్నారు. మండలంలోని వాడపల్లి నుంచి మిర్యాలగూడ వరకు నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారికి ఇరువైపులా బీఆర్ఎఎస్ ప్రభుత్వంలో హరితహారం కింద మొక్కలు నాటారు. అవి నేడు చెట్ల్లుగా మారి ప్రయాణికులకు నీడను అందిస్తున్న క్రమంలో విద్యుత్ లైన్లకు అడ్డుగా వస్తున్నాయని ఇష్టారాజ్యంగా ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేస్తున్నారు. రహదారి వెంట కొత్తగా విద్యుత్ స్థంభాలు వేయడంతో వాటికి అడ్డుగా ఉన్నాయనే నెపంతో చెట్లను నరికి వేస్తున్నారు. బీఆర్ఎఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెట్లను నాటి సంబంధిత గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సంరక్షణ చేపట్టింది. రోడ్డుకు ఇరువైపులా పచ్చదనంతో మంచి వాతావరణాన్ని కల్పిస్తున్న చెట్లను నరికి వేయడంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.