దేవరకొండ, జూలై 29 : ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల పితామహుడని, మహిళలను అదుకునేందుకు కృషి చేస్తున్నా రని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలంలోని 58 మంది లబ్ధి దారులకు రూ. 58లక్షల కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు చీరెలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవరకొండ మండలంలో ఇప్పటివరకు 1,634 మంది లబ్ధిదారులకు రూ. 16 కోట్ల చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. కల్యిణలక్ష్మి చెక్కులు పేదలకు వరమని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలందించడంతోపాటు పేద కుటుంబాలని ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, ఆర్డీఓ గోపి రాం, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్, తాసీల్దార్ రాజు లింగయ్య, జడ్పీటీసీ అరుణాసురేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్‌గౌడ్, వైస్ చైర్మన్ రహత్‌అలీ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్రనాయకుడు హన్మంత్ వెంకటేశ్‌గౌడ్, పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ వ్యడ్తా దేవేందర్‌నాయక్, పొన్నబొయిన సైదులు, జయప్రకాశ్‌నారాయణ, కృష్ణ, ఇలియాస్ పటేల్ పాల్గొన్నారు.
కార్యకర్తలే టీఆర్ఎస్ బలం : ఎమ్మెల్యే
కొండమల్లేపల్లి : పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా నిలబడుతుందని, కార్యకర్తలే పార్టీకి బలమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. కొండమల్లేపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ నేరెడుగొమ్ము మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు శక్తిమేర కృషిచేయాలన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, జడ్పీటీసీ కేతావత్ లాలునాయక్, పీఏసీఎస్ చైర్మన్ బాలయ్య,హన్మానాయక్, రవీందర్, రాజు, రాములు, బిక్కునాయక్, కృష్ణ, నరేశ్, బాలు, పాషా, హస్లి, అనిల్, బషీర్ పాల్గొన్నారు.