హైవేపై ఘోర ప్రమాదం
మండల పరిధిలోని ఇనుపాముల శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందగా, భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
- అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు
- తల్లీకొడుకు దుర్మరణం
- భార్య, కుమారుడికి తీవ్ర గాయాలు
- కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద ఘటన
కేతేపల్లి, డిసెంబర్ 16 : మండల పరిధిలోని ఇనుపాముల శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందగా, భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ ఎం.అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణం విద్యానగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చీదెళ్ల ఫణికుమార్(43) గురువారం కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌లో బంధువుల ఫంక్షన్‌కు వెళ్లాడు. తిరిగి సూర్యాపేటకు వస్తుండగా ఇనుపాముల వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొని ఫల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఫణికుమార్ తో పాటు అతడి తల్లి కరుణ(62) అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు కారులో ఉన్న ఫణికుమార్ భార్య కృష్ణవేణి, కుమారుడు సాయితరుణ్కు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు కారు అద్దాలు పగులగొట్టి మృతదేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని దవాఖానకు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి బావ పబ్బిశెట్టి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కారు నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీసిన 15 నిమిషాల తర్వాత మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. దీంతో ఇతర వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో దవాఖాన వద్ద బంధువుల రోధనలు మిన్నంటాయి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

