ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నా రు.
మిర్యాలగూడ, నవంబర్ 26 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తెలంగాణ ఆడబిడ్డలకు అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నా రు. శనివారం మిర్యాలగూడ పట్టణం, మండలం, అడవిదేవులపల్లి, వేములపల్లి, మాడుగులపల్లి మండలాలకు చెందిన 248 మందికి, ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం మిర్యాలగూడలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో పేదల ఇండ్లల్లో ఆడబిడ్డ పెండ్లి భారం కాకూడదనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ బి.చెన్నయ్య, తాసీల్దార్ అనిల్, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎంపీపీలు నూకల సరళాహన్మంతరెడ్డి, బాలాజీనాయక్, పోలక శ్రీవిద్య, జడ్పీటీసీలు విజయసింహారెడ్డి, సేవ్యానాయక్, ఇరుగుమంగమ్మ, నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ఏడుకొండలు, తిరుపతమ్మ, బాబయ్య, సైదులుయాదవ్, రాములగౌడ్ పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి
దామరచర్ల : మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మండలానికి చెందిన 144 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని తాళ్లవీరప్పగూడెం గ్రామ శివారులోని అన్నవేరు, కృష్ణానది సంగమం వద్ద రూ. 229.25 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ నందిని, జడ్పీటీసీ లలిత, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి. నారాయణరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అధ్యక్షుడు కె. వీరకోటిరెడ్డి, తాసిల్దార్ ఖాదర్, ఆర్ఐ సతీశ్, వైస్ ఎంపీపీ కె. సైదులు, ఎంపీటీసీలు సోము సైదిరెడ్డి, బాల లక్ష్మి, డి. వెంకటేశ్వర్లగౌడ్, బాల సత్యనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

