నల్లగొండ, నవంబర్ 24: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్బెడ్రూం ఇళ్ల లబ్ధిదా రుల కేటాయింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర రహదారులు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ,రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాల ప్రగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడారు. ఆయా జిల్లాల వారీగా ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం నిర్మాణాలు, లబ్ధ్దిదారుల ఎంపిక, ఇళ్ల పంపిణీ , పెండింగ్ పనుల గురించి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నాటికి డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధ్దిదారులకు కేటాయించినట్లు, మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తుది దశలో ఉన మిగతా నిర్మాణాలను సైతం పూర్తి చేసి, గడువులోపు లబ్ధ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.వీడియా కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఖుష్భూ గుప్తా, భాస్కర్ రావు, గృహ నిర్మాణ పీడీ రాజ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.