మాల్, నవంబర్ 17 : రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చింతపల్లి మండలంలోని మధనాపురంలోని సీసీరోడ్లు, నర్సరీ, డంపింగ్ యార్డులు ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్, రైతు బీమా, రైతుబంధు పథకాలను అమలు చేసి కొనసాగిస్తున్న ఘనంత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అనంతరం తీదేడులోని ప్రభుత్వ పాఠశాలకు సైన్స్ పరికరాలను అందజేశారు. గ్రామానికి చెందిన పలువురికి రైతు బీమా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా చైర్మన్ కంకణాల ప్రవీణావెంకట్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్‌రెడ్డి, ఎంపీపీ కొండూరి భవానీపవన్కుమార్, ఏడీ విరప్పన్, ఏఓ కె.రామలింగేశ్వర్రావు, ఎంపీడీఓ శేషు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు సాగర్‌రావు, ఆ పార్టీ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, కిష్టారెడ్డి, సర్పంచ్ ఉడుత అఖిలాయాదవ్, నాయకులు ఉడుత అక్రమ్యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, గండికోట శ్రీను, కొండూరి శ్రీను, అశోక్, చాంద్‌పాషా, రాములు, సుదర్శన్, తిరుపతయ్య పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
దేవరకొండ : మండలంలోని గొడకొండ్ల గ్రామానికి చెందిన మధార్కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.30వేల చెక్కును గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, బోయపల్లి శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ నేరేడుగొమ్ము మండలాధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, బిక్కునాయక్, వడిత బాలూనాయక్, రవీందర్, కుంభం నరేశ్ పాల్గొన్నారు.