యాదాద్రి, నవంబర్17 : టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే వివిధ పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆలేరు మండలంలోని కొలనుపాకకు చెందిన కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు సొంటెం ప్రవీణ్‌యాదవ్ ఆధ్వర్యంలో 200 మంది, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంధమల్ల నరేశ్, గంధమల్ల కిష్టయ్య, మోత్కురి రాజయ్య, మాజీ ఎంపీటీసీ నమిలె చిన్న అయిలయ్య ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో యాదగిరిగుట్ట పట్టణంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లో నమ్మకం కోల్పోయాయని తెలిపారు. ఎనిమిది ఏండ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని ఎన్నో హామీలను సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తూ దేశ ప్రజల దృష్టి తనవైపు తిప్పుకుంటున్నాడని పేర్కొన్నారు.
ప్రతి గడపకూ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గడిచిన ఎనిమిది ఏండ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు అందించాలన్నదే కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. కేసీఆర్‌కు అండగా తెలంగాణ సమాజం సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లో పాత, కొత్త తారతమ్యం లేకుండా పార్టీ మరింత బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఆలేరు మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, సర్పంచ్ ఆరుట్ల లచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ అనితాఅంజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింహులు, పీఏసీఎస్ డైరెక్టర్ ఆరె మల్లేశ్, మాజీ సర్పంచ్ మల్లేశ్ యాదవ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగ స్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నర్సింగ్‌రావు, యూత్ అధ్యక్షుడు సురేశ్ పాల్గొన్నారు.