భూదాన్‌పోచంపల్లి, నవంబర్ 17 : సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి మండలం పెద్దగూడెంలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో పాఠశాల విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేశారు. అనంతరం పోచంపల్లిలో కమ్యూనిటీహాల్, అంగన్వాడీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన, రూ.20లక్షల నిధులతో పోచంపల్లి పెద్ద చెరువు తూమ్ రిపేర్ పనులను ప్రారంభించారు. అనంతరం మండలకేంద్రంలోని ఫంక్షన్ హాల్లో 72 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ముగ్గురికి ఎస్సీ కార్పొరేషన్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడగుల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, జడ్పీటీసీ కోల పుష్పలతామల్లారెడ్డి, వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, తాసీల్దార్ వీరాభాయి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డి, ఎంపీడీఓ బాలశంకర్, సర్పంచ్ మన్నె పద్మారెడ్డి, నాయకులు కందాడి భూపాల్‌రెడ్డి, సామ రవీందర్‌రెడ్డి, బత్తుల మాధవీశ్రీశైలం, రావుల శేఖర్‌రెడ్డి, పాటి సుధాకర్‌రెడ్డి, సీతావెంకటేశం, సామల మల్లారెడ్డి, రవీందర్, మధు, పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లికి చెందిన చేరాల పద్మ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతుండగా సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.3.50లక్షల ఎల్ఓసీని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆమె స్వగృహాన్ని వెళ్లి అందజేశారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని, పెద్ద కూతురు వివాహానికి ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.