తుర్కపల్లి, నవంబర్14 : విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో ఉన్నతంగా రాణించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాదాపురం జడ్పీహెచ్ఎస్లో సోమవారం నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ముందుకెళ్లాలని సూచించారు.
క్రమశిక్షణతో శ్రమిస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చన్నారు. అలాగే ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన ధర్మారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన విద్యార్థిని మాలోతు కవితను ఆమెను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, సర్పంచ్ యాట పోషమణి, టీఆర్ఎస్ యువజన నాయకుడు గట్టు తేజస్వీనిఖిల్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్‌కుమార్, చిన్నలక్ష్మాపురం సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ కోడూరి కొమురయ్య, ఉప సర్పంచ్ సీస రాజు, సీస నారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాజాపేట : బాలల దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలోని అంగన్వాడీ చిన్నారులకు టీఆర్ఎస్ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు మోత్కుపల్లి ప్రవీణ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రేగు సిద్ధులు, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు భూపతి బాలరాజు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎర్రగుంట ప్రభాకర్, పాండవుల నరేందర్‌గౌడ్, కొండూరి స్వామి, గంధమల్ల సురేశ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు సోలిపురం అరుణ చిన్నారులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ధనమ్మ, శ్రీవాణి, జానకి, సక్కుబాయి పాల్గొన్నారు.
చౌటుప్పల్ : స్థానిక శాఖా గ్రంథాలయంలో జరిగిన వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేశ్ గౌడ్, షాదీఖానా చైర్మన్ ఖలీల్, ఆర్టీఏ జిల్లా మాజీ మెంబర్ తడక చంద్రకిరణ్, డైరెక్టర్లు గోశిక రవి, బొబ్బిళ్ల శ్రీనివాస్, ఇబ్రహీం, సిలివేరు కృష్ణ పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : మండలంలోని వడపర్తి, చందుపట్ల అంగన్వాడీ కేంద్రాల్లో బాలల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమాల్లో వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, వార్డు సభ్యుడు ఎర్ర మహేశ్ ప్రధానోపాధ్యాయుడు గుర్రం రాజు, ఉపాధ్యాయులు శైలజ, ఉపేంద్ర, దేవి, రమేశ్, భాస్కర్, అంగన్వాడీ టీచర్లు దంతూరి భాగ్యలక్ష్మి, రజిని పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాలల దినోత్సవం జరుపుకొన్నారు. ప్రిన్సిపాల్ పాపిరెడ్డి, అధ్యాపకులు మురళి, కుమార్, వెంకటేశం, నర్సింహ, రమేశ్, ఇందు, సుమన్, కిష్టయ్య, శృతి పాల్గొన్నారు.
బీబీనగర్ : పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ నెహ్రూ చిత్రపటానికి నివాళి అర్పించారు. విద్యార్థులు వివిధ వేషధారణల్లో అలరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : పట్టణంలోని గౌతమి హైస్కూల్లో నిర్వహించిన వేడుకల్లో కరస్పాండెంట్ రావుల జంగయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వలిగొండ : మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో, గాయత్రీ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ వెంకటరమణ, సాయిని యాదగిరి, పిట్టల ఆంజనేయులు, తవుటం నరహరి, కొంతం భిక్షపతి, పనుమటి మురళీధర్‌రెడ్డి, పాలకూర్ల వెంకటేశం, భీముడి కవిత, దయాకర్ పాల్గొన్నారు.
రామన్నపేట : మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణల్లో అలరించారు. అనంతరం విద్యార్థులకు క్రీడలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. వివేకానంద పాఠశాల విద్యార్థులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీసుల సహకారంతో హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి గులాబీలు అందించారు. హెల్మెట్ ధరించి బైక్ నడపాలని సూచించారు. కరస్పాండెంట్ తిరుగుడు మల్లికార్జున్, ఏఎస్ఐ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మోత్కూరు : పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో వెల్‌బేబీ షో, ముగ్గుల పోటీలు, డ్రాయింగ్, చెస్, క్యారమ్స్, డ్యాన్స్, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణల్లో అలరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సత్యనాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.