ఆలేరు రూరల్, నవంబర్ 13 :స్వరాష్ట్రంలో సర్కార్ బడులకు మహర్దశ పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. మొదటి విడుతగా మండలంలోని ఆరు ప్రాథమిక, ఐదు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,10,24,978 నిధులు మంజూరు చేసింది. పాఠశాలల్లో నీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, ఫర్నిచర్, పాఠశాల మరమ్మతులు, కొత్త తరగతి గదుల నిర్మాణం, డిజిటల్ విద్య వంటి సదుపాయాల కోసం నిధులను ఉపయోగిస్తున్నారు.
వసతుల కల్పనకు కృషి
మండలంలో మొదటి విడుతగా మొత్తం 11పాఠశాలలను ఊరుమన బడి కార్యక్రమానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయా పాఠశాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులకు వరం.
– రమేశ్, పీఆర్ ఏఈ, ఆలేరు
బాగా చదువుకుంటాం
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వం మా పాఠశాలను బాగు చేయించడం సంతోషంగా ఉంది. డిజిటల్ విధానంలో బోధన సాగిస్తే మాలాంటి విద్యార్థులకు బాగుంటుంది. బాగా చదుకొని మంచి ఫలితాలు సాధిస్తా.
– మడూరి అక్షత, విద్యార్థిని, కొలనుపాక