యాదాద్రి, నవంబర్ 12 : ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్థానం లేదని ఎన్డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అమృతం బాలరాజు, యువజన విభాగం అధ్యక్షుడు దూసరి గణేశ్, యువజన నాయకుడు చిట్టబోయిన ప్రవీణ్, వార్డు సభ్యులు పుప్పాల మహేశ్ ఆధ్వర్యంలో 200మంది నాయకులు యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 2నెలలుగా సుమారు 6వేల మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరారన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమైన నాయకులు త్వరలో టీఆర్ఎస్లో చేరబోతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. మతోన్మాద బీజేపీకి స్వస్తి పలికి దేశ దశదిశ మార్చేందుకు సీఎం కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ను ప్రజలు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారని తెలిపారు. దేశ రాజకీయాల్లోకి రావాలంటూ అన్ని రాష్ర్టాల రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్నేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు అండగా తెలంగాణ సమాజం సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆలేరు మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌యాదవ్, వైస్ ఎంపీపీ గాజుల వెంకటేశ్‌యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, సర్పంచ్ లచ్చిరెడ్డి, ఉప సర్పంచ్ అనితాఅంజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింహులు, పీఏసీఎస్ డైరెక్టర్ మల్లేశ్‌గౌడ్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు ఎం.భాను, జిల్లా నాయకుడు పరిదె సంతోశ్, యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి వీరస్వామిగౌడ్, నాయకుడు తెరాల శంకర్ పాల్గొన్నారు.