నల్లగొండ రూరల్, నవంబర్ 12: రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఐకేపీ అధ్వర్యంలో మండలంలోని పెద్ద సూరారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదన్నారు. ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. కార్య క్రమంలో ఎంపీపీ మనిమద్దె సుమన్, టీఆర్ఏస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్‌రెడ్డి, గాదె రాంరెడ్డి, నార్మక్స్ డైరెక్టర్ జలంధర్‌రెడ్డి, సర్పంచ్ రమాదేవీజ యపాల్రెడ్డి, నరసింహా, ఎంపీటీసీ రత్నమాల, మాజీ వైస్ ఎంపీపీ అరుణ, మాజీ జడ్పీటీసీ యాదయ్య, ఏపీఎం సైదులు, సీసీ రమేశ్,వీఓఏ రవి, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : మున్సిపల్ చైర్మన్ చిన వెంకట్‌రెడ్డి
చిట్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం చిట్యాల మార్కెట్ యార్డులో నేరడ గ్రామ సంఘబంధం సభ్యులు ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించి ఏ గ్రేడ్‌కు రూ. 2,060 బీ గ్రేడ్ రకానికి రూ. 2,040 మద్దతు ధర పొందాలన్నారు. అదేవిధంగా మండలంలోని వనిపాకల, తాళ్లవెల్లెంల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పార్రంభించారు. కార్యక్రమంలో డీపీఎం మోహన్‌రెడ్డి, ఏపీఎం పద్మ, సీసీలు రేణుక, డీఎంజీ సత్తిరెడ్డి, గ్రామ సంఘబంధం అధ్యక్షులురాలు లక్ష్మమ్మ, మార్కెట్ కార్యదర్శి జానయ్య, రైతులు పాల్గొన్నారు.