భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 11 : ఉత్తమ సేవలకు గుర్తింపు తప్పక లభిస్తుందని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ అన్నారు. భువనగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లోని వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ రాఘవేందర్‌తో పాటు సిబ్బందిని కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిపై నిబద్ధతతో పనిచేసే వారికి విజయం తప్పక వరిస్తుందన్నారు. రానున్న రోజుల్లో మరింత ప్రతిభ కనబర్చాలని సూచించారు. కార్యక్రమంలో యాదాద్రిభువనగిరి, మల్కాజిగిరి డీసీపీలు కే.నారాయణరెడ్డి, రక్షిత, ఏసీపీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి ఏఎస్ఐ జాన్సన్(53) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. జాన్సన్ మృతదేహాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్, డీసీసీ నారాయణరెడ్డి సందర్శించి నివాళులర్పించారు.