నడిగూడెం, నవంబర్ 11: రైతుల ఆర్థిక బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని సిరిపురం, నారాయణపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దళారుల బెడదను అరికట్టేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో కోదాడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి, ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి పాల్గొన్నారు.
అనంతగిరి : త్రిపురవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంపెట ఉపేందర్‌గౌడ్, ఏపీఎం లక్ష్మి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
మునగాల : మండలంలోని నర్సింహపురంలో కోదండరామస్వామి తిరుకల్యాణం సందర్భంగా కోదండరామస్వామి సేవాసమితి సాంస్కృతిక, సామాజిక సేవా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో దాదాపుగా 450 మంది వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాతలను అభినందించారు. అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో సర్పంచ్ నాగమణీసైదులు, సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వేమూరి సత్యనారాయణ, రైతు బంధు సమితి అధ్యక్షుడు సుం కర అజయ్‌కుమార్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొమ్మ చిన్నవెంకన్న, ఆలయ కమిటీ అధ్యక్షుడు బొమ్మ అంజయ్య, దాతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.