బొమ్మలరామారం, నవంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్ద తు ధర లభిస్తుందని ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ప్యారారం గ్రామంలో ధీశాలి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయ న ప్రారంభించి మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుషంగల సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సింహ, ధీశాలి చైర్మన్, గ్రామీణ మహిళామండలాధ్యక్షురాలు విజయలక్ష్మి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, దండు యాదగిరి, హరిలాల్ పాల్గొన్నారు.