మునుగోడు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలోని తన చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి మునుగోడు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలి వెళ్లారు.
ఎమ్మెల్యే కూసుకుంట్లకుఅభినందనల వెల్లువ
రెండోసారి ఎమ్మెల్యే అయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో జరిగిన కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతోపాటు మునుగోడు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కూసుకుంట్లకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.