నీలగిరి, నవంబర్ 9 : ప్రభుత్వం నల్లగొండలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినందున వైద్యులు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కోరారు. నల్లగొండ మెడికల్ కళాశాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే
కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువే గాక వారికున్న ప్రతిభ చాటేలా ముందుకు సాగాలని సూచించారు.
మెడికల్ కళాశాల విద్యార్థులు డాక్టర్లుగా మారాక నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. కళాశాలతో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలను రోగులు, వారి సహాయకులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి, సూపరింటెండెంట్ లచ్చునాయక్, కౌన్సిలర్లు గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, ఆస్పత్రి సిబ్బంది ఏర్పుల కామేశ్వర్, మాండ్ర వె