కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలైన చెరువుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి, వాడపల్లిలోని అగస్తేశ్వర స్వామి ఆలయాలతోపాటు ప్రసిద్ధ శివాలయాల్లో వేడుకలు ఘనంగా జరిపారు. నల్లగొండ పట్టణ శివారులోని పానగల్ ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలు, వాడపల్లి, చెర్వుగట్టు క్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రి శివాలయాలు, యాదాద్రిభువనగిరి జిల్లాలోని భువనగిరిలో పచ్చలకట్ట సోమేశ్వరాలయం, యాదాద్రి క కొండపై కార్తిక దీపాలు వెలిగించారు. తెల్లవారుజాము నుంచే ముక్కంటికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అభిషేకాలు, బిల్వార్చనలు, దీపోత్సవాలు నిర్వహించారు. పలు ఆలయాల్లో జ్వాలా తోరణాలు వెలిగించారు.