మునుగోడు ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సోమవారం మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు అవకాశమిచ్చి గెలిపించినందుకు కూసుకుంట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. కూసుకుంట్ల వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామక్రిష్ణారెడ్డి, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఉన్నారు.
భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 7 : మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. సోమవారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా అభినందించి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో ఎంతో శ్రమించి ప్రభాకర్‌రెడ్డి గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ, నాయకత్వంపై విశ్వాసంతో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల కార్యచరణలో పెట్టేందుకు పూనుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన వారిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రనాయక్, గాదరి కిశోర్, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, పైళ్ల శేఖర్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడె విద్యాసాగర్, యాదాద్రిభువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సోమా భరత్‌కుమార్, ఉమా మాధవరెడ్డి , చాడా కిషన్‌రెడ్డి, వేంరెడ్డి నర్సింహారెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా శంకర్ ఉన్నారు.