యాదాద్రి, అక్టోబర్ 16 : యాదాద్రీశుడి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి, లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ధర్మ దర్శనా నికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటన్నర సమయం పట్టిన్నట్లు భక్తులు తెలిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల నిత్యతిరుకల్యాణోత్సవం కనుల పండువగా జరిపారు.
స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం శ్రీసుదర్శన నారసింహహోమం ఘనంగా జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా కొనసాగాయి. సుమారు 36 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ.40,72,463 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 3,94,900
వీఐపీ దర్శనాలు 4,50,000
వేద ఆశీర్వచనం 7,800
సుప్రభాతం 6,600
ప్రచార శాఖ 60,200
వ్రత పూజలు 1,45,600
కళ్యాణకట్ట టిక్కెట్లు 1,39,300
ప్రసాద విక్రయం 19,88,050
వాహన పూజలు 20,200
అన్నదాన విరాళం 14,177
శాశ్వత పూజలు 2,500
సువర్ణ పుష్పార్చన 1,50,000
యాదరుషి నిలయం 1,05,956
పాతగుట్ట నుంచి 54,880
కొండపైకి వాహన ప్రవేశం 5,50,000
లక్ష్మీ పుష్కరిణి 800
శివాలయం 8,000
ఇతర విభాగాలు 18,500