రామగిరి, అక్టోబర్ 16 : పోలీసుల బందోబస్తు.. సీసీ కెమెరాల నిఘాలో ఆదివారం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సజావుగా ముగిసింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 16,084 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 52 పరీక్ష కేంద్రాల్లో 13,195 మంది పరీక్ష రాశారు. 2,889 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 82.04శాతం హాజరు నమోదైంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. 9 మంది అభ్యర్థులు పరీక్షకు ఆలస్యంగా వచ్చి వెనుదిరిగారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, రాహుల్‌శర్మ పర్యవేక్షణలో అధికార యంత్రంగా పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని 31 పరీక్ష కేంద్రాల్లో 9,181 మంది అభ్యర్థులకు గాను 7,471(81.39 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. 1,710 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఆర్డీఓ రాజేంద్రకుమార్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.