యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ)/ చండూరు : ఊర్లకు ఊర్లకే గులాబీ పార్టీ బాటపడుతున్నాయి. కారు పార్టీలోకి వలసల జోరు మరింత ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీకి షాక్ ఇస్తూ కారెక్కుతున్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయమనే ధీమాతో ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి చక్రం తిప్పుతుండటంతో కారు పార్టీకి క్యూ కడుతున్నారు. ఏకంగా ఆదివారం ఒక్కరోజే ఐదు గ్రామాలకు చెందిన సర్పంచులు గులాబీ కండువా కప్పుకొన్నారు. చండూరు మండలానికి చెందిన ఐదుగురు, మునుగోడు మండలానికి ఓ సర్పంచ్ పార్టీలో చేరారు. వారికి మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ మునుగోడు మండలాధ్యక్షుడు, పలివెల సర్పంచ్ గజ్జెల బాలరాజు సైతం గులాబీ గూటికి చేరారు.
చండూరు మండలంలోని కస్తాల సర్పంచ్ మెండి ద్రౌపతమ్మ, నెర్మట సర్పంచ్ నందికొండ నర్సిరెడ్డి, గుండ్రపల్లి సర్పంచ్ తీగల సుభాశ్, దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, తుమ్మలపల్లి సర్పంచ్ కూరపాటి లక్ష్మీసైదులు తమ అనుచరగణంతో పార్టీలో చేరారు. మునుగోడు మండలంలోని కోతులారం సర్పంచ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు జాజుల పారిజాత, సత్యనారాయణగౌడ్ దంపతులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా మునుగోడు మండలం కిష్టాపురానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మానుకూంట్ల కుమారస్వామిగౌడ్, పంతంగి లింగస్వామిగౌడ్, సురుగు లింగస్వామి, సురిగి రాజు, సురిగి వెంకన్న, జాజుల శ్రీశైలం మంత్రి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఇక నారాయణపురం మండల కేంద్రానికి చెందిన 30ముస్లిం కుటుంబాలు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరాయి. చౌటుప్పల్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో 2, 3 వార్డులకు చెందిన 30మంది కారు పార్టీలో చేరారు. నాంపల్లి మండంలోని మహ్మదాపురంలో మెదక్ ఎమ్మెల్యే సమక్షంలో 150మంది గులాబీ గూటికి చేరారు. మునుగోడు మండలంలోని గూడపూర్‌లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 20మంది నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లె కళ్యాణీరవికుమార్, గట్టుప్పల్ మండల కన్వీనర్ ఇడెం కైలాసం, బొడిగె వెంకటేశం పాల్గొన్నారు.