నీలగిరి, అక్టోబర్ 16: తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రూ.15 వేల బిల్లు వసూలు చేస్తుందని అన్నారు. సాగు రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చిందని ఆరోపించారు. మునుగోడు మండలం గూడపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ఆ పదవిని బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టిన రాజగోపాల్‌రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిసి ఐదేళ్లపాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకుండా తన స్వార్థం కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారారని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికను తెచ్చి ఆ భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డి ఆ డబ్బు మూటలతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సుమారు 20 మంది టీఆర్ఎస్లో చేరగా.. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు నరసింహ, పంకజ్ యాదవ్, కడారి కృష్ణయ్య, ఒంగోలు సహదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో మండలం కేంద్రంలోని ఐదో వార్డులో వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ నేతలు మందిడి సైదిరెడ్డి, బండ పురుషోత్తంరెడ్డి, కర్నాటి స్వామి యాదవ్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో శ్రీరాములు, వెంకన్న, నరసింహచారి, రవి, యాదగిరి, నరసింహ, పగిల్ల యాదయ్య, మునుగోటి రాజు, చొల్లేటి మదనాచారి, వట్టికోట యాదయ్య, కొంక జానయ్య, నారాయణ ఉన్నారు.