చౌటుప్పల్ రూరల్ (జైకేసారం), అక్టోబర్ 16: డిపాజిట్ దక్కదనే భయంతోనే బీజేపీ నేతలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ తాను టీఆర్ ఎస్‌లోనే ఉంటానన్నారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి మండలంలోని జైకేసారంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమి భయంతోనే బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు అసత్య ప్రచారానికి తెరలేపడం విడ్డూరంగా ఉందన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన పుకార్లను కార్యకర్తలు విశ్వసించరని తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులంతా సైనికుల్లా పనిచేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.