యాదాద్రి, అక్టోబర్ 15 : ఆలేరు అభివృద్ధి ప్రదాత, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులు, తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు బీర్ల అయిలయ్య బహిరంగ చర్చకు సిద్ధం కావాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య సవాల్ విసిరారు. అయిలయ్య స్వగ్రామం సైదాపురంలోనే చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. అంతేకానీ నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అయిలయ్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆగ్రో సంస్థ పేరిట అక్రమంగా ఆస్తులను కూడబెట్టుకుని ఇతరులపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, డెవలప్మెంట్ లేకుండా సొంత కంపెనీ పేరుతో సామాన్య ప్రజలను మోసం చేసింది నిజాం కాదా? అని ప్రశ్నించారు.
స్పెక్ట్రా కంపెనీకి 600 ఎకరాల భూమిని ఫ్లాట్ల రూపంలో అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పి 200 ఎకరాలే ఇచ్చింది వాస్తవం కాదా? అన్నారు. అయిలయ్య నిర్వాకంతోనే స్పెక్ట్రా కంపెనీ మూతపడే స్థితికి చేరిందన్నారు. ఒకప్పుడు మారుతి 800 కారులో తిరిగే అయిలయ్యకు కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. మరోసారి ప్రభుత్వ విప్ దంపతులు, టీఆర్ఎస్ పార్టీపై స్థాయికి మించి విమర్శలు చేస్తే ఆలేరు నియోజకవర్గంలో తిరుగనివ్వమని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తోటకూరి అనురాధ, చొల్లేరు సర్పంచ్ తోటకూరి బీరయ్య, మైలారీగూడెం ఉప సర్పంచ్ మారెడ్డి కొండల్‌రెడ్డి, మాసాయిపేట టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుణగంటి బాబురావు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బండ బాలసిద్ధులు, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, యువజన విభాగం పట్టణాధ్యక్షుడు ముక్యర్ల సతీశ్‌యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి భీమగాని నర్సింహాగౌడ్, మహేంద్ర యువసేన అధ్యక్షుడు మిట్ట అనిల్‌గౌడ్, నాయకులు తోటకూరి మల్లేశ్, కాదూరి శ్రీశైలం, సదానందం పాల్గొన్నారు.
రాజాపేట : కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విప్ దంపతులపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాకల్ల ఉపేందర్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు అయిలయ్య ఆగ్రో సంస్థ పేరిట అక్రమంగా సంపాదించిన ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. సమావేశంలో పీఏసీఎస్ డైరెక్టర్ మర్ల నాగరాజు, నాయకులు గౌటే లక్ష్మణ్, రాసూరి నర్సయ్య, మయ్మ భాస్కర్, సందిల భాస్కర్‌గౌడ్, సట్టు తిరుమలేశ్, మోత్కుపల్లి ప్రవీణ్, నాగిర్తి గోపిరెడ్డి, పల్లె సంతోశ్, కటకం స్వామి, గుర్రం నర్సింహులు, బెడిదే వీరేశం, రేగు సిద్ధులు, జూకంటి బాలస్వామి, గజ్జెల రాజు పాల్గొన్నారు.
ఆలేరు : ప్రభుత్వ విప్ దంపతులపై కాంగ్రెస్ నాయకుడు అయిలయ్య చేసిన నిరాదార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆలేరు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగూల శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్ అన్నారు. ఆలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్లెన్నెస్ ఆగ్రో సంస్థ పేరిట అక్రమంగా సంపాదించిన ఆస్తులు, వ్యక్తిగత ఆరోపణలపై అయిలయ్య బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, మండలాధ్యక్షుడు గంగూలశ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, సర్పంచులు పర్వతాలు, పాండరి, కౌన్సిలర్ నర్సింహులు, టీఆర్ఎస్ నాయకులు మొరిగాడి వెంకటేశ్, గవ్వల నర్సింహులు, అనసూర్య, సీస రాజేశ్, ఫయాజ్ పాల్గొన్నారు.
బొమ్మలరామారం : డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగోని వెంకటేశ్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు తీరు మార్చుకోకపోతే ప్రజల కోపాగ్నికి గురికాక తప్పదని హెచ్చరించారు. టీఆర్ఎస్ మండల నాయకులు బట్కీరు బీరప్ప, వెంకటేశ్, శ్రీకాంత్‌గౌడ్, గణేశ్, రమేశ్, రామకృష్ణ, ఉపేందర్, నాగేశ్ పాల్గొన్నారు.