నాంపల్లి, అక్టోబర్ 15 : ప్రచారంలో భాగంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మండలంలోని జమ్మిగడ్డ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలపై వివరించారు. ప్రజలతో మమేకమవు తూ కారుగుర్తుకు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిమ్మల్ని చూశాక కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ విజయం సాధిస్తారని నమ్మకం కలిగిందన్నారు. మోదీ రాజ్యంపోయి రామరాజ్యం రావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల్లో సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని రాజగోపాల్‌రెడ్డి మాటతప్పాడని, ఇప్పుడు ఓ మొఖంపెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడో సమాధానం చెప్పాలన్నారు. జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధికారప్రతినిధి పోగుల వెంకట్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం నాయకులు అంజాచారి, ముద్దులింగం, మండల కో ఆప్షన్ సభ్యుడు అబ్బాస్ పాల్గొన్నారు.
నాంపల్లి మండలం నామనాయక్తండబాకు చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 40మంది నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి పోగుల వెంకట్‌రెడ్డి, రమావత్ శంకర్‌నాయక్, దేపావత్ రవినాయక్ పాల్గొన్నారు.