నాంపల్లి, అక్టోబర్ 15: అభివృద్ధి చేస్తాడని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే మనుగోడు ప్రజల నమ్మకన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన రాజగోపాల్‌రెడ్డిని ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. మండలంలోని చిట్టంపహాడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ లకు చెందిన 50 మంది కార్యకర్తలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రిమాట్లాడు తూ రూ.22వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయిన రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరుగాలంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి గెలుపించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ కుమార్ నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గ్రామ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మునుగోడు రూరల్ : మండలంలోని చొల్లేడు గ్రామానికి చెందిన 40 కుటుంబాలు, ఇద్దరు వార్డు సభ్యులు సర్పంచ్ జనిగల మహేశ్వరీసైదులు, ఎంపీటీసీ వనం నిర్మలాయాదయ్య, ఉప సర్పంచ్ గోదల శంకర్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బుడిగపాక యేసు ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో కదిరె లింగస్వామి, బొడ్డు రవి, ఉడుగుండ్ల శంకర్, వంగూరు అంజయ్య, బొమ్మకంటి సైదులు, బొడ్డు శ్రీకాంత్, రాములు, రవి, అనిల్, విష్ణు, కాశయ్య, స్వామి, ప్రసాద్, ప్రభాకర్, సైదులు, వేణుగోపాల్ రెడ్డి, నవీన్, రాజు ఉన్నారు.
మునుగోడు, అక్టోబర్ 15 : మిత్రపక్షాలు ఐక్యంగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు మండల ఎంపీటీ సీ 1,2 క్లస్టర్ పరిధిలోని మిత్రపక్షాల ముఖ్య నాయకులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా దిశనిర్దేశం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇతర పార్టీలో చెం దిన పలువురు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి జగదీశ్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో జడ్పీటీసీ నార బోయిన స్వరూపారాణీరవి, ఎంపీపీ కర్ణాటక స్వామి యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి , నాయకులు మిర్యాల వెం కన్న చాపల శ్రీను వెంకన్న పాల్గొన్నారు.