యాదాద్రి, అక్టోబర్15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా కొనసాగాయి. శనివారం తెల్లవారుజామూన స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన నిర్వహించారు.
స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహహోమం ఘనంగా జరిపారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో గజవాహన సేవను నిర్వహించి స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. కల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి, అమ్మవార్ల తిరువీధి సేవ, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజల అత్యంత వైభవంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. సుమారు 17 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 20,79,075 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
పధాన బుక్కింగ్ ద్వారా 1,75,350
వీఐపీ దర్శనాలు 90,000
వేద ఆశీర్వచనం 9,600
సుప్రభాతం 3,900
ప్రచార శాఖ 10,600
వ్రత పూజలు 1,04,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 66,700
ప్రసాద విక్రయం 9,42,800
వాహన పూజలు 13,500
అన్నదాన విరాళం 43,886
శాశ్వత పూజలు 60,000
సువర్ణ పుష్పార్చన 80,348
యాదరుషి నిలయం 62,944
పాతగుట్ట నుంచి 28,110
కొండపైకి వాహన ప్రవేశం 2,50,000
లక్ష్మీ పుష్కరిణి 800
శివాలయం 8,200
లీసెస్ 1,26,737