నాంపల్లి, అక్టోబర్ 14 : ప్రజల గోడును తీరుస్తున్న కేసీఆర్‌కు అండగా ఉండాలని, పల్లెలు బాగు పడాలంటే కారును గెలిపించాలని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నాంపల్లి మండలం చల్లవానికుంటలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల తరఫున ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రభాకర్‌రెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తుండగా, బీజేపీ కుట్రలు పన్ని, ఆగం చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు.
బీజేపీ ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచుతూ సామాన్యుల బతుకును భారంగా మార్చుతున్నదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించి, తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. బీజేపీ అధికారం ఉన్న రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను ప్రజలు ప్రశ్నించాలన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం ఉన్నది అంటే అది కేసీఆర్ అధ్యక్షతన నడుస్తున్న తెలంగాణలో మాత్రమేనని పేర్కొన్నారు.
అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే మునుగోడు ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కాగా, చల్లవనికుంట గ్రామానికి చెందిన బీజేపీ యువకులు భారీ సంఖ్యలో మంత్రి సమక్షం టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఏలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి పోగుల వెంకటరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా మాజీ కార్యదర్శి పోగుల నారాయణరెడ్డి, సర్పంచులు రపోతు దేవేంద్రాసత్యనారాయణ, రమావత్ సుగుణాశంకర్ నాయక్, కో-ఆప్షన్ సభ్యులు అబ్బాస్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జింకల నరేశ్, జంగిటి గిరి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ గిరిజన మోర్చా నాయకుడు టీఆర్ఎస్లో చేరిక
నాంపల్లి, అక్టోంబర్ 14 : మండలంలోని నామనాయక్తండాకు చెందిన బీజేపీ గిరిజన మోర్చా స్టేట్ కో ఆర్డినేటర్ దేపావత్ రవినాయక్ విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి పోగుల వెంకట్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్ అబ్బాస్, రమావత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.