మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రం గులాబీమయమైంది. గులాబీ సైనికులకు తోడు వామపక్షాల బైక్ ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తింది. గురువారం మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరు కాగా, ఆయనకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. చండూరులో అడుగు పెట్టగానే, డ్రోన్ల సహాయంతో పూల వర్షం కురిపించారు. మహిళలు బోనాలతో తరలివచ్చారు. మంత్రికి పూలబొకే అందించి, శాలువాలతో సన్మానించారు. మంత్రితో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడింది. చండూరు మండలం బంగారిగడ్డ గ్రామం నుంచి చండూరు పట్టణం వరకు 4 కిలోమీటర్ల మేర వాహనాలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలతో నిండిపోయింది. గంట
పాటు సాగిన రోడ్‌షోలో యువత డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రోడ్‌షో కార్యకర్తల్లో మరింత జోష్ నింపింది. చండూరు పట్టణంలో ఉన్న ప్రజలు, వ్యాపారస్తులు, దుకాణాదారులు షాపులు మూసి మరీ బయటకొచ్చి కేటీఆర్‌కు అభివాదం చేశారు. ఒకటో వార్డు వాసులందరూ ఇండ్లకు తాళాలు వేసి, మంత్రి కేటీఆర్ రోడ్‌షోకు తరలివచ్చారు.
మంత్రి కేటీఆర్ రోడ్‌షో గ్రాండ్ సక్సెస్
దారులన్నీ గులాబీమయం..తోడుగా ఎర్రసైన్యం నాలుగు కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీ బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో ఘన స్వాగతం బీజేపీ, రాజగోపాల్ మోసాలను ఎండగట్టిన మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లను గెలిపించాలని పిలుపు