చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 30 : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజి ట్ దక్కదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఆరెగూడెం, గుండ్లబావి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గుండ్లబావి గ్రామానికి చెందిన 50మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆ గ్రామాల్లో పార్టీ శ్రే ణులు నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టాడని, వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. వీటిని చూసి ఇతర రాష్ర్టాల ప్రజలు కూ డా సీఎం కేసీఆర్ నాయకత్వం కావాలని ఎదురుచూస్తున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రయోజనం లేదన్నారు. కేవలం 18వేల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారాడన్నారు. కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మునగాల ప్రభాకర్‌రెడ్డి, ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, నాయకులు జాల మల్లేశ్ యాదవ్, ఎం సంజీవరెడ్డి, ఎన్నపల్లి ముత్తిరెడ్డి, నందగిరి శ్యామ్‌గౌడ్, నందగిరి మల్లేశ్‌గౌడ్, భీమిడి వెంకట్‌రెడ్డి, మల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.