చౌటుప్పల్, అక్టోబర్ 13: సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మండలంలోని తూప్రాన్‌పేట్ గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 18 కుటుంబాల వారు గురువారం టీఆర్ఎస్లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోనే ప్రజలందరూ టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు బక్కతట్ల యాదగిరి, ఐతరాజు వీరు, కాతోజు కృష్ణ చారి, సోంపంగి సైదులు తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ జంగిలి భిక్షపతి, వరుకూరి భానుచందర్, దినేష్, రవి, పరమేష్, గణేష్, విక్రమ్, సాయి, వెంకటయ్య, స్వామి పాల్గొన్నారు.