మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాలు బలపర్చిన టీఆర్ఎస్(బీఆర్ఎస్)అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం
నామినేషన్ దాఖలు చేశారు. చండూరు లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలంలో అధికారి జగన్నాథరావుకు
నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్
రావుతోపాటు నియోజకవర్గవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్,
సీపీఎం, సీపీఐ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చారు.
కూసుకుంట్లకు మద్దతుగా..
నామినేషన్ ర్యాలీలో నినదిస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు తదితరులు