ఆలేరు, అక్టోబర్ 12 : తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ప్రదాతగా నిలిచారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని వైఎస్ఆర్ గార్డెన్లో వైస్ ఎంపీపీ గాజుల లావణ్యావెంకటేశ్యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 500 మంది, ఆలేరు పట్టణంలోని 12వ వార్డుకు చెందిన 30 మంది, యాదగిరిగుట్ట మండలం కమటంగూడేనికి చెందిన కో ఆప్షన్ సభ్యుడు నగేశ్, వార్డు సభ్యుడు వెంకటేశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోషయ్యతో పాటు 50 మంది, సాదువెల్లి నుంచి 10, గౌవరాయపల్లి నుంచి 50 మంది టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీరందరికీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మహేందర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపించడం శుభపరిణామం అని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేదర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల దేశంలోని రైతులందరికీ మేలు జరుగుతుందన్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఆలేరు నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మంది వివిధ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రేగళ్ల లింగం, కాంగ్రెస్ మహిళాధ్యక్షురాలు దీప, వార్డు సభ్యులు కొంతం వెంకటేశ్, గొట్టం కృష్ణారెడ్డి, ఆలేరు నుంచి ఆలేటి అజయ్, పేరబోయిన కృష్ణ, కమటంగూడెం వెంకటేశ్, సాదువెల్లి డొంకెన వీరేశ్, సీస భరత్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, సర్పంచ్ కొటగిరి జయమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్, యూత్ అధ్యక్షుడు పూల శ్రవణ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం వెంకటపాపిరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు అయిలీ కృష్ణ, మాజీ వైస్ ఎంపీపీ కోరుకొప్పుల కిష్టయ్య, ఎంపీటీసీ జూకంటి అనురాధ, నాయకులు పత్తి వెంకటేశ్, మొరిగాడి వెంకటేశ్ పాల్గొన్నారు.