యాదాద్రి, అక్టోబర్ 10: బీజేపీకి ఓటేస్తే భంగపాటు తప్పదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. లంబాడీ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. బొమ్మలరామారామం మండలంలోని తిర్మలగిరి గ్రామం కాంగ్రెస్ వార్డు సభ్యులు దారావత్ రాణి రవీందర్ నాయక్, కాట్రోత్ మాన్య నాయక్, మాజీ వార్డు సభ్యులు శత్కానాయక్, బిచ్చాలు, కాట్రోత్ బిచ్చాల్ ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, 6వ వార్డు సభ్యుడు ఊట్ల బాలయ్య ఆధ్వర్యంలో 100 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి సోమవారం టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా సునీత, మహేందర్‌రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్టీ కులాల జాబితాలో లంబాడీలను తొలగించాలని బీజేపీ ఎంపీలు కేంద్రానికి వినతులు అందిస్తున్నారని అన్నారు. దీనిని లంబాడీలు గమనించాలని సూచించారు. వైస్ ఎంపీపీ గొడుగు చంద్రమౌళి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గణేశ్ ముదిరాజ్, సర్పంచులు అశోక్‌నాయక్, నోముల రామిరెడ్డి, నవీన్‌గౌడ్, ఆనంద్ చారి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) బొమ్మల రామారం మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ,పీఏసీఎస్ డైరెక్టర్ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామిడి రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సుధాకర్ నాయక్, ఊట్ల మాకయ్య పాల్గొన్నారు.
ఆలేరురూరల్ : ప్రజల పాటకు ప్రతిరూపం ఎర్ర ఉపాలి అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. సోమవారం మండలంలోని రాఘవాపురంలో కవి, గాయకుడు ఎర్ర ఉపాలి 3వ వర్ధంతి సభలో పాల్గొని ఆయన స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు ప్రాంతానికి చెందిన కవిగా, గాయకుడిగా ఉపాలి ప్రజల హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బక్క రాంప్రసాద్, ఎర్ర ఉపేంద్ర, సూర్యం, చంద్రశేఖర్, ఆకాశ్, రాజు పాల్గొన్నారు.