చండూరు(గట్టుప్పల) అక్టోబర్ 9 : బీజేపీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన వారు వారంలోనే మోస పోయామని తెలుసుకుని తిరిగి టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సమక్షంలో గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన బీజేపీ బూత్ ఇన్చార్జి గంజి గణేశ్‌తో పాటు కార్యకర్తలు, సానుభూతిపరులు 200మంది టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ గట్టుప్పల అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. గట్టుప్పల వాసుల చిరకాల కోరికైన మండల ఏర్పాటును సీఎం కేసీఆర్ నేరవేర్చారన్నారు.
ప్రస్తుతం మండల అభివృద్ధిని కాంక్షించి పలువురు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో బీమగాని చంద్రశేఖర్, కొంగరి సందీప్, సంజీవ, వీరాంజనేయులు, సూరపల్లి బుచ్చయ్య, బీమగాని లింగస్వామి, వెంకటేశ్, పులిపాటి నాగరాజు, పున్న శ్రీను, మదగాని సాయి కిరణ్, సందీప్, వాయిళ్ల ప్రవీణ్, కాంగ్రెస్ నుంచి కర్నాటి వెంకటేశం, గంజి అంజయ్య, వట్టికోటి మహేశ్, నరేశ్, పగిళ్ల కిరణ్, పెద్దగాని వెంకటేశ్ ఉన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ గంప గోవర్ధన్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆగన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఇడెం కైలాసం, గట్టుప్పల గ్రామ శాఖ అధ్యక్షుడు బండారు చంద్రయ్య, సర్పంచ్ ఇడెం రోజా, ఎంపీటీసీ ఆవ్వారు గీత, బీమగాని మహేశ్, నామని గోపాల్, అవ్వారు శ్రీనివాస్, ఇడెం గణేశ్, పురుషోత్తం, రాఘవేందర్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మండల కన్వీనర్‌గా ఇడెం కైలాసం
గట్టుప్పల టీఆర్ఎస్ మండల కన్వీనర్‌గా గట్టుప్పల మండల సాధన సమితి కన్వీనర్ ఇడెం కైలాసాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. మండల ఏర్పాటుకు కైలాసం చేసిన కృషికి తగిన గౌరవం దక్కడంతో పలువురు మండల ప్రజలు అభినందించారు.
మర్రిగూడ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గల విశ్వసనీయతకు ఇతర పార్టీల నుంచి చేరికలే నిదర్శనమని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు.
మండలంలోని వట్టిపల్లికి చెందిన టీడీపీ మాజీ ఎంపీటీసీ మెండు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులు మల్గిరెడ్డి అనంతరెడ్డి, ఎడ్ల కాశయ్య, గ్రామశాఖ ఉపాధ్యక్షుడు భిక్షమయ్య, సీనియర్ నాయకుడు గాదగోని యాదయ్య, మైనార్టీ నాయకులు బషీర్, ఖాజా, ఇంతియాజ్ సహా వాళ్ల అనుచరులు ఆదివారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, సర్పంచ్ కల్లు స్వాతీనవీన్రెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల శ్రీరాములు, గ్రామశాఖ అధ్యక్షుడు కొంపెల్లి నాగరాజుగౌడ్, విద్యా కమిటీ చైర్మన్ పి.కృష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శి వీరమల్ల వెంకటేశ్‌గౌడ్, నాయకులు సత్తిరెడ్డి, భిక్షం, శివ, విఘ్నేశ్ పాల్గొన్నారు.
150మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేరిక
మునుగోడు : మండలంలోని జక్కలివారిగూడెం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు 150మంది నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో దాసరి స్వామి, సురేశ్, సందీప్, కృష్ణ, నాగరాజు, స్వామి, ఆంజనేయులు, సాయి, శ్రీశైలం, మహేశ్ ఉన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు జక్కలి లింగస్వామి, ఉపాధ్యక్షుడు జక్కలి శ్రీశైలం, సీనియర్ నాయకులు జక్కలి లింగస్వామి, దోటి నగేశ్, రావుల శ్రీను పాల్గొన్నారు.
రవీంద్రకుమార్ సమక్షంలో చేరికలు
నాంపల్లి : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని రేఖ్యాతండా, వస్రాంతండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 30మంది ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రమావత్ శంకర్‌నాయక్, కృష్ణ పాల్గొన్నారు.
కూసుకుంట్ల సమక్షంలో చేరిక
నాంపల్లి / సంస్థాన్ నారాయణపురం : నాంపల్లి మండలంలోని నర్సింహులగూడెం సర్పంచ్ బల్గూరి విష్ణువర్దన్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో నాయకులు గుండెబోయిన రాంవెంకట్, జింకల సత్యనారి, జాలా అంజయ్య, బెల్లంకొండ రమేశ్, తాల శేఖ ర్, జింకల రాము లు, కాటం అంజయ్య, కాటం సతీశ్ ఉన్నారు. అదేవిధంగా సంస్థాన్‌నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామ వివిధ పార్టీలకు చెందిన 30కుటుంబాలు ఆయన సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరాయి.