చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్ 12 : అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జైకేసారం, చింతలగూడెం, దామెర తదితర గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు సుమారు 200 మందిపైగా సోమవారం ఆయన సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అదే విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దాంతో ప్రజలకు సైతం సీఎం కేసీఆర్ పాలనపై విశ్వనీయత ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, సర్పంచులు నారెడ్డి ఆండాలు, కొర్పూరి సైదులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, ఢిల్లీ మాధవరెడ్డి, చిన్నం బాలరాజు, నారెడ్డి అభినందన్‌రెడ్డి, దొడ్డి లింగస్వామి, నీల శేఖర్, మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గెలుపులో భాగస్వామ్యం అయ్యేందుకే చేరికలు
-జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి
మర్రిగూడ : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం తథ్యమని, పార్టీ గెలుపులో భాగస్వాములయ్యేందుకే ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని జిల్లా ఫైనాన్స్ కమిటీ సభ్యుడు, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఖుదాభక్ష్పల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతురాజు రాజుయాదవ్ సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు జడ్పీటీసీ సురేందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్తోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధ్ది సాధ్యమవుతుందన్నారు. టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పందుల పాండుగౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు మాదగోని శేఖరయ్య, నాయకులు బొడ్డుపల్లి సైదులు, దూసరి లక్ష్మయ్య, పొట్ట సత్తయ్య, బొల్లారపు యాదయ్య పాల్గొన్నారు.