చండూరు/నాంపల్లి/మర్రిగూడ, సెప్టెంబర్ 11 : మునుగోడు నియోజకర్గంలో టీఆర్ఎస్లోకివలసల జోరు కొనసాగుతున్నది. ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 50 మంది.. నాంపల్లి మండలం మల్లపురాజు పల్లికి చెందిన మాజీ సర్పంచ్‌తోపాటు పలువురు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మర్రిగూడెం మండలంలోని యరగండ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 9వ వార్డు సభ్యురాలితోపాటు మరికొందరు కూసుకుంట్ల ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
చండూరు, సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని బంగారిగడ్డ గ్రామ సర్పంచ్ పల్లె వెంకటయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 50మంది కార్యకర్తలు మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో బోయపల్లి నాగార్జున, జక్కలి సందీప్, ఇరిగి సల్మాన్, తీగల భాగ్యమ్మ, నల్పరాజు రమేశ్, జక్కలి రమేశ్, బేరే వంశీ, బోయపల్లి స్వామి, కారింగు మహేశ్, నిమ్మల ప్రసాద్, పాలకూరి రాకేశ్, అయోధ్య, ప్రవీణ్, గణేశ్ ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గుర్రం వెంకట్‌రెడ్డి, మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, మాజీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, మాజీ ఎంపీపీ వెంకన్న, పలువురు నాయకులు పాల్గొన్నారు.
నాంపల్లి : మండలంలోని మల్లపురాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పల్లేటి లింగయ్య, నాగరాజు, బీజేపీకి చెందిన గొడ్డటి రామచంద్రం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎడుదొడ్ల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్, సర్పంచ్ మునుగల సుధాకర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు పానగంటి వెంకన్న, అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.
మర్రిగూడ : మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్ ఆధ్వర్యంలో మండలంలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు సభ్యురాలు ముండ్ల వెన్నెలాశివకుమార్తో పాటు నాయకులు ముండ్ల వెంకటేశ్, రవి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, యు వజన నాయకుడు సంతోశ్‌కుమార్ పాల్గొన్నారు.