నార్కట్‌పల్లి, సెప్టెంబర్ 8: టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండలంలోని బెండల్‌పహాడ్, నల్లోనిగూడెం, బాకిగూడెం గ్రామాల్లో రూ.20లక్షల ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పలు గ్రామాల్లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు. అనంతరం గ్రామాల్లో పలు వినాయక మండపాల వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. కార్యక్రమాల్లో సర్పంచ్ ఎడమ శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మమ్మ, బద్దం రాంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, నాయకులు వంగాల రాందాస్, కట్టంగూరు సత్తయ్య, నర్సిరెడ్డి, ఏఈ మోహన్ పాల్గొన్నారు.
ఎల్ఓసీ అందజేత
కట్టంగూర్ : మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన బసవోజు ఝూన్సీకి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరైంది. సంబంధిత పత్రాన్ని గురువారం నకిరేకల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బాధితురాలికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మల్లారం సర్పంచ్ దాసరి సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.